Srivaishnava Logo
Home | Books and Articles | Photos | Audio | Contact | Gokulam Classes
Sampradayam    |    Juniors    |    Seniors    |    Super Seniors    |    Prabandham    |    Samskrutam    |    Music

Welcome to Gokulam classes (Super Seniors)


     
Srimathi S Lakshmi Garu,
Visakhapatnam

Classes
 1. Class on 31-Jul-2020 : Audio , Video

 2. Class on 01-Aug-2020 : Audio (part-1) , Video (Part-1) , Audio (part-2) , Video (Part-2)

 3. Class on 07-Aug-2020 : Audio , Video

 4. Class on 08-Aug-2020 : Audio , Video

 5. Class on 14-Aug-2020 : Audio , Video

 6. Class on 15-Aug-2020 : Audio , Video


Notes

Classes

Alavandar stotram notes_pdf

  ఆళవందార్ స్తోత్రము ప్రశ్నలు -జవాబులు
   

1.యామునులకు ఉన్న మరొక పేరేమిటి?
 ఆళవందార్. 

2.యామునులకు సంప్రదాయ రహస్యాలను అందించిన ఆచార్యులు ఎవరు?
మణక్కాల్ నంబి.

3.యామునులు వ్రాసిన గ్రంథాలలో ఒక మూడింటిని వ్రాయండి. 
ఆత్మసిద్ధి, సంవిత్సిద్ధి, ఈశ్వర సిద్ధి (సిద్ధి త్రయము),ఆగమ ప్రామాణ్యము,పురుష నిర్ణయము,మాయావాద ఖండము, గీతార్థ సంగ్రహము, కాంతా చతుశ్లోకి,స్తోత్ర రత్నము (వీటిలో ఏ మూడు వ్రాసినా సరోతుంది. )

4.మన పెద్దలు "రత్నాలు"గా చెప్పినవి ఎన్ని?అవి ఏవి?
మంత్ర రత్నము-ద్వయమంత్రము, పురాణ రత్నము-విష్ణు పురాణము, స్తోత్ర రత్నము-ఆళవందార్ స్తోత్రము.

5.యామునాచార్యుల తాతగారి పేరు వ్రాయండి?
నాధమునులు.

6.త్రయీ అనగా-?
వేదము. 

7.ఈ స్తోత్రంలో యామునులు నాధమునులను ఎన్ని శ్లోకాలలో స్తుతించారు?
మూడు శ్లోకాలు. 

8.యామునులు నాధమునులకుగల "పరతత్వ విషయిక "జ్ఞాన భక్తులను ప్రశంసించినది ఎన్నవ శ్లోకం లో?
ఒకటవ శ్లోకం.

9.త్రికరణములు ఏవి?
మనస్సు, వాక్కు, కాయము. 

10.ఏది సరియైనది-1.నమో నమః 2.నమోన్నమః3.నమ నమః 4.నమోః నమః .
నమో నమః

11.నాధమునులకుగల భగవంతుని అవతార విషయిక జ్ఞాన భక్తులు ఏ శ్లోకం లో వర్ణింపబడ్డాయి?
రెండవ శ్లోకం

12.నాధమునులు దేనికి సింధువువంటివారు?
భగవత్ భక్తి

13.నాధమునులను వేటికి రాశియైనవారిగా చెప్పారు?
జ్ఞాన వైరాగ్యాలకు

14."అంఘ్రి సరోజములు " అంటే ఏమిటి?
పాద పద్మములు

15.ఎవరి చరణద్వయము తనకు శరణము అని ఆళవందార్ అన్నారు?
నాధమునులు 

16.మాటకు ఎటువంటి వైలక్షణ్యం ఉండాలి?
అవిస్తృతి, అసందిగ్ధత, గంభీరత.

17."ఽ" ఈ గుర్తును ఏమని పిలవాలి?
అకార ప్రశ్లేష 

18.భగవత్ స్మరణ ఎలా సాగాలి?
తైలధార వలె ఎడతెగకుండా సాగాలి.

19.మూడవశ్లోకంలో ఆళవందార్  నాథమునులకు అపరిమితంగా ఉన్నవి ఏవని చెప్పారు?
భగవద్భక్తి, తత్త్వ జ్ఞానము

20.అబ్ధి- అంటే అర్థం ఏమిటి?
సముద్రము.

21.ఆళవందార్లు నాలుగవ శ్లోకంలో ఎవరికి నమస్కారం చేస్తున్నారు?
 పరాశరులకు. 

22.తత్త్వములెన్ని?అవి ఏవి?
తత్త్వములు మూడు.  చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు

23.చిద్వర్గమెవరు?
 బద్ధులు, ముక్తులు, నిత్యులు

24.సాంసారిక భోగానుభవానికి ఉపాయం ఏది?
 నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్టానము

25.అపవర్గము-అంటే?
 మోక్షము.
 
26.సామవేద సారమైన నమ్మాళ్వార్ల ప్రబంధం ఏది?
Tiruvaaymozhi
 
27."కణ్ణినుణ్ శిరుత్తాంబు "అనుగ్రహించినవారెవరు?
Madhurakavulu - Nammalvaar vishayamulo
 
28.నమ్మాళ్వార్ల అనుగ్రహం కోసం కణ్ణినుణ్ శిరుత్తాంబు 12000పర్యాయాలు జపించినవారెవరు?
 Naathamunulu
 
29.ప్రపన్నులకు కులపతులెవరు?
 Nammalvaar

30.'అన్వయము '-అంటే?
Vamsamu

31.శ్రుతి శిరస్సులు అంటే ఏవి?
 ఉపనిషత్తులు .
 
32.ఆశ్రయణసౌకర్యాపాదక గుణములు ఏవి?
 సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము, స్వామిత్వము
 
33.ఆశ్రిత కార్యాపాదక గుణములు ఏవి?
 జ్ఞానము, శక్తి
 
34.నమ్మాళ్వార్లకు ఉన్న మరొక పేరేమిటి?
 శఠకోపులు
 
35."మనోరథము"- అంటే?
  కోరిక.
  
36.వేదము భగవంతుని ఏ గుణాన్ని కొలవాలని ప్రయత్నించి వెనక్కు మళ్ళిపోయింది? 
 ఆనంద గుణము.

37."శ్రీగుణరత్న కోశం " రచించినవారు ఎవరు?
 పరాశర భట్టర్.

38.నాథమునులు అనుగ్రహించిన గ్రంథాలు ఏవి?
న్యాయ తత్త్వము, యోగ రహస్యము, పురుష నిర్ణయము.

39."పితామహుడు " అంటే ఎవరు?
 చతుర్ముఖ బ్రహ్మ

40. "త్రపా"- అంటే?
 సిగ్గు
 
41."భగవంతుడు త్రివిధ పరిచ్ఛేదములు లేనివాడు "- త్రివిధ పరిచ్ఛేదములు ఏవి?
   1.దేశ పరిచ్ఛేదము  2.కాల పరిచ్ఛేదము 3.వస్తు పరిచ్ఛేదము

42."శర్వ పితామహాద్యైః" అనే స్థలంలోని 'ఆది ' శబ్దం చేత ఎవరిని చెప్పవచ్చు?
  వేదము,సనక సనందనాదులు

43.సృష్టి కర్త  ఎవరు?
  బ్రహ్మ.

44."అర్ణవము "- అంటే?
   సముద్రము

45. "శీకరము " - అంటే
   తుంపర

46.యామునులు తనకి శక్తి లేకున్నా ఎలా స్తోత్రం చేస్తానన్నారు?
   జ్ఞానము ఉన్నంతవరకు, శ్రమ కలిగేంతవరకు

47. "యద్వా శ్రమావధి..."అనే శ్లోకం లో  యామునులు  తమను, బ్రహ్మాదులను వేటి వేటితో పోల్చారు?
  అణువు, కులపర్వతం
48.స్తౌమ్యేవ -క్రిందివానిలో ఏది సరియైనది?
స్తౌమ+యేవ,  స్తౌమి +ఏవ , స్తౌమి +మ్యేవ, స్తౌమి +ఇవ 
  స్తౌమి+ఏవ

49.అబ్జనేత్ర-అంటే?
తామరలవంటి నేత్రములు కలవాడా

50.యామునులు తనకు భగవదనుగ్రహం కలగడంలో ఏది కారణం కాదనీ, ఏది కారణం అనీ  చెప్పారు?
తన సామర్థ్యం కారణం కాదు... ఆయనని స్తుతించడం మొదలుపెట్టగానే కలిగే శ్రమ, బడలిక- ఆ దైన్యమే అనుగ్రహానికి కారణం.

51.మూలకారణమైన పరమాత్మను వేదం ఏ పదాలతో చెప్పింది?
సత్ , బ్రహ్మ

52.ముక్తులు అంటే ఎవరు?
లీలావిభూతిలో కొన్నాళ్ళు ఉండి పరమాత్మ అనుగ్రహం వల్ల మోక్షం పొందేవారు.

53."నిత్యులు"-కొంతమందిని ఉదాహరణగా చూపించండి. 
విష్వక్సేనుడు, గరుడుడు

54.శుద్ధసత్త్వమయమైన ప్రకృతి ఉండేదెక్కడ?
నిత్యవిభూతిలోని పరమపదంలో

55.".సుహృత్ "-అంటే?
స్నేహితుడు - హితాన్ని కోరేవాడు

56.సర్వేశ్వరుని నియమన శక్తి ఎటువంటిది?
  స్వాభావికమైనది, అవధిలేనిది

57.వైదికుడు అంటే?
  వేదార్ధమును ఎరిగినవాడు

58."అర్ణవము "- అంటే?
 సముద్రము

59.పరమాత్మలో ప్రకాశించు గుణమేది?
  సత్వగుణము

60."తస్య యధా కప్యాసం పుండరీకమేవ మక్షిణీ "-ఇది ఏ ఉపనిషత్తులోనిది?
  ఛాందోగ్య ఉపనిషత్తు.
  
61.వేదాలను అపహరించినవారెవరు?
మధుకైటభులు

62.రాక్షసుల బారినపడ్డ వేదాల్ని తిరిగి తెచ్చేందుకు పరమాత్మ ధరించిన రూపం ఏది?
హయగ్రీవ అవతారము

63.సౌశీల్యము అంటే?
తమకన్నా తక్కువ వారిని ఏవి హెచ్చుతగ్గులు లేకుండా కలిసిపోవడము

64.పద్ధెనిమిది పురాణాలను ఎన్ని విధాలుగా విభజించారు?అవి ఏవి?
మూడు. సాత్విక, రాజస, తామస పురాణాలు.

65.  7,8,11,13,14 శ్లోకాలలో "చతుర్ముఖ బ్రహ్మ " పేర్లు ఉన్నాయి. అవి గుర్తించి వ్రాయండి.
7-పితామహుడు, 8-చతుర్ముఖుడు, 11-బ్రహ్మా, 13-ప్రజాపతి, 14-విరించి

66."పరమాత్మ దేశ పరిచ్ఛేదము లేనివాడు "-తెలియజేయండి. 
ఒక దేశములో ఉంటే ఇంకొక దేశములో ఉండలేరు - ఇటువంటి పరిచ్ఛేదము ఉండదు

67.చతుర్దశ భువనాల పేర్లు వ్రాయండి. 
సత్య, తాప, జన, మహా, సువ, భువ, భుః - ఊర్ధ్వ లోకాలు
అతల, విటల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ - అధో లోకాలు

68.సప్తావరణలు ఏవి?
జల, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారం, మహత్తు, అవ్యక్తం

69.ప్రధానం అని దేనికి పేరు?
ప్రకృతి

70."పరాత్పరం " అనేదానిచేత ఎవరిని చెప్పవచ్చు?
ముక్తులు, నిత్యులు